అపార్ట్‌మెంట్‌లో హైటెక్‌ దందా | - | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌లో హైటెక్‌ దందా

Apr 2 2026 8:40 AM | Updated on Apr 2 2026 8:40 AM

ప్లాట్‌లో సాగుతున్న వ్యభిచారం

పోలీసుల దాడులతో వెలుగులోకి..

మహబూబ్‌నగర్‌ క్రైం: నగరంలో హైటెక్‌ వ్యభిచార దందా విస్తృతంగా సాగుతుంది. వాట్సాప్‌లో అమ్మాయిల ఫొటోలను ఎరవేసి విటులను ఆకర్షిస్తున్నారు. సోషల్‌ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది. నమ్మదగిన విటులకు వాట్సాప్‌లో అమ్మాయిలు, మహిళల ఫొటోలు పంపించి బేరం కుదుర్చుకుంటున్నారు. నగరంలో క్లాస్‌ ఏరియాలో సైతం ఇళ్లు, ఫ్లాట్లను అద్దెకు తీసుకొని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. బుధవారం పట్టణంలోని అశోక్‌ టాకీస్‌ ప్రాంతంలో ఉన్న శ్రీసాయి బాలాజీ టవర్స్‌ అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌నంబర్‌ 309పై పోలీసులు దాడి చేయగా ఇద్దరు మహిళలు, ఐదుగురు విటులు పట్టుబడినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు రెండో పట్టణ సీఐ ఇజాజుద్దీన్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాట్‌పై దాడి చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు విటులతో పాటు వ్యభిచార గృహంలో ఉద్యోగిగా పనిచేసే అజయ్‌ని అరెస్టు చేశారు. దందా నిర్వాహకుడు సంతోష్‌రెడ్డి పరారీలో ఉన్నారు. దందా నడుపుతున్న వారితో పాటు విటులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement