ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మర్రి జనార్దన్‌రెడ్డి హెచ్చరిక
బల్మూర్: కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని, వారికి తగిన బుద్ధి చెబుతామని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. మండలంలోని జిన్‌కుంట సర్పంచ్ రంగినేని పుష్పలతతో పాటు ఆమె భర్త ప్రేమ్‌కుమార్‌ను బుధవారం పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెలలో కాంగ్రెస్ వార్డు సభ్యురాలు, నాయకులు జిన్‌కుంటలో సర్పంచ్‌పై దాడి చేయడమే కాకుండా ఆమైపె అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన సర్పంచ్‌లను వేధిస్తున్న విషయాలను ప్రజలు గమనిస్తేనే ఉన్నారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ చేతకాని పాలనతో గ్రామాల అభివృద్ధిని మరిచి, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులపై దాడులకు దిగడంతో పాటు అక్రమ కేసులు పెడుతున్నారని, అధికారులు వారికే వంత పాడుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పోకల మనోహర్, బండపల్లి వెంకటయ్య, నర్సయ్యయాదవ్, సురేష్‌రావు, తులసీరాం, అంతటి శివ, రమేష్‌రావు, నాగయ్య, శివశంకర్, శిరీష, తిపరుపతి, సుల్తాన్, గోపాల్‌రావు, సుదర్శన్, మహేష్, పాల్గొన్నారు.


