బాదేపల్లి టు జడ్చర్ల | - | Sakshi
Sakshi News home page

బాదేపల్లి టు జడ్చర్ల

Feb 3 2026 7:54 AM | Updated on Feb 3 2026 7:54 AM

బాదేప

బాదేపల్లి టు జడ్చర్ల

మలి చైర్మన్‌

గుబ్బ

విశ్వనాథం

తొలి చైర్మన్‌ కొత్త కేశవులు

2021 ఏప్రిల్‌లో ఎన్నికలు

రెండో పర్యాయం మున్సిపాలిటీగా మారిన తరువాత అనేక ఒడిదొడుకుల మధ్య 2021 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి. మే 5న నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కారణంగా పాలక వర్గానికి ఈ ఏడాది మే 4 వరకు గడువు ఉండటంతో ఎన్నికలు జరగటం లేదు. రెండోసారి మున్సిపాలిటీ అయ్యాక తొలి చైర్‌పర్సన్‌గా దోరేపల్లి లక్ష్మి ఎన్నికయ్యారు. మూడేళ్లపాటు కొనసాగాక అవిశ్వాసంతో వైదొలగాల్సి వచ్చింది. ఆ తరువాత కోనేటి పుష్పలత చైర్‌పర్సన్‌గా ఎన్నికై కొనసాగుతున్నారు. ఈ పర్యాయం రిజర్వేషన్‌ జనరల్‌ (అన్‌రిజర్వుడు)గా రావడంతో మున్ముందు ఉత్కంఠ రేపనుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో 27 వార్డులు ఉన్నాయి.

2019లో బాదేపల్లి మున్సిపాలిటీ పేరును జడ్చర్ల మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. దీంతో విలీనం ప్రక్రియలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి. బాదేపల్లి పేరు చరిత్రలో నిలిచిపోయింది. 2020 డిసెంబర్‌ 15తో జడ్చర్ల పంచాయతీ పాలకవర్గం గడువు ముగియడంతో విలీన ప్రక్రియ సమాప్తం అయ్యింది. నాటి నుంచి జడ్చర్ల మున్సిపాలిటీ అధికారికంగా మారిపోయింది. మున్సిపాలిటీ పరిధిలో బాదేపల్లి, బూరెడ్డిపల్లి, నాగసాల, జడ్చర్ల, కావేరమ్మపేట, శంకరాయపల్లితండా, నక్కలబండ తండాలు ఉన్నాయి. మున్సిపాలిటీగా ప్రారంభమైన చరిత్ర గ్రామ పంచాయతీగా, నగర పంచాయతీగా, మున్సిపాలిటీగా అనేక రూపాలు మారింది.

2019లో జడ్చర్ల మున్సిపాలిటీగా మార్పు

బాదేపల్లి టు జడ్చర్ల 1
1/2

బాదేపల్లి టు జడ్చర్ల

బాదేపల్లి టు జడ్చర్ల 2
2/2

బాదేపల్లి టు జడ్చర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement