జములమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
● అమ్మవారికి ఆహ్వానం పలికేందుకు బయలుదేరిన బండి
● నేడు మెట్టినింటికి చేరుకోనున్న అమ్మవారు
గద్వాల న్యూటౌన్: జిల్లాకేంద్రంలో ప్రసిద్ధిచెందిన జములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అర్చకులు ఆలయంలో, అమ్మవారి నాగపడిగకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం 11 గంటల ప్రాంతంలో నాగపడిగను పూజారులు తలపై ధరించి అమ్మవారిని ఆహ్వానించేందుకు పుట్టిన ఊరైన గుర్రంగడ్డకు ఆలయం నుంచి ఎద్దులబండిపై బయలుదేరారు. డప్పుల మోతలు.. వాయిద్యాలు.. అమ్మవారి పూనకాలతో భక్తులు ఉరేగింపుగా వెళ్లారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురంధర్‌కుమార్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
నేడు మెట్టినింటికి అమ్మవారు..
బుధవారం ఉదయం 6 గంటలకు అమ్మవారు తన మెట్టినిల్లు అయిన జమ్మిచేడులోని జములమ్మ ఆలయానికి చేరుకోనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
జములమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం


