జములమ్మ బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

జములమ్మ బ్రహ్మోత్సవాలు

Jan 29 2026 8:17 AM | Updated on Jan 29 2026 8:17 AM

జములమ

జములమ్మ బ్రహ్మోత్సవాలు

మెట్టినింటికి చేరుకున్న అమ్మవారు

గద్వాలన్యూటౌన్‌: భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న జములమ్మ అమ్మవారు బుధవారం మెట్టినిల్లుకు చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారిని పుట్టినిల్లు అయిన గుర్రంగడ్డ నుంచి ఎడ్లబండిపై తీసుకొచ్చారు. అనంతరం సంప్రదాయబద్దంగా నాగపడిగను ఎండ్లబండిలో ఉంచి, విశేష పూజలు చేస్తూ జమ్మిచేడులోని ఆలయానికి చేర్చారు. గుర్రంగడ్డ నుంచి జమ్మిచేడు వరకు మేళతాళాలు... డప్పుల మోతలు... కుర్వడోళ్ల సప్పుల్లు...పోతరాజుల విన్యాసాలు... వందలాది మంది భక్తుల భక్తిపారవశ్యం మధ్య ఉరేగింపుగా అమ్మవారు ఆలయానికి చేరుకున్నారు. ఎడ్లబండి ఆలయానికి చేరుకోగానే పూజారులు అమ్మవారి విగ్రహానికి నాగపడిగను ధరింపజేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురందర్‌కుమార్‌, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

జములమ్మ బ్రహ్మోత్సవాలు 1
1/1

జములమ్మ బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement