రాజ్యాంగ పరిరక్షణతోనే సమాజ శ్రేయస్సు | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిరక్షణతోనే సమాజ శ్రేయస్సు

Jan 28 2026 8:27 AM | Updated on Jan 28 2026 8:27 AM

రాజ్య

రాజ్యాంగ పరిరక్షణతోనే సమాజ శ్రేయస్సు

కొల్లాపూర్‌ రూరల్‌: ప్రకృతిపై ప్రేమ, వైజ్ఞానిక దృక్పథం, రాజ్యాంగ పరిరక్షణతోనే సమాజ శ్రేయస్సు అని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని సోమశిలలో కృష్ణానది తీరాన విజ్ఞానదర్శిని నెహ్రూసెంటర్‌, నేచర్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రకృతి వైజ్ఞానిక యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వాలు చేపట్టాల్సిన సామాజిక బాధ్యతాయుతమైన పనిని స్వచ్ఛందంగా తమ భుజాలపై వేసుకొని ప్రజలను చైతన్యం చేస్తున్న జన విజ్ఞాన వేదిక నిర్వాకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వెనకడుగు వేయకుండా పట్టుదలతో చేస్తున్న పనితీరు అద్భుతమని కొనియాడారు. శాసీ్త్రయ ఆలోచన విధానంతో పాటు దేశ ప్రజలందరికి రక్షణ కవచమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. మూఢ నమ్మకాలు, వివక్ష వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు యువత, మేధావులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమ నిర్వహణకు అయ్యే ఖర్చును రాష్ట్ర సాంస్కృతికశాఖ నుంచి మంజూరు చేస్తానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో మరిన్ని వైజ్ఞానిక యాత్రలు నిర్వహించాలని కోరారు. అనంతరం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌ వెన్నెల గద్దర్‌, కవి జయరాజ్‌ మాట్లాడారు. కార్యక్రమంలో విజ్ఞానదర్శిని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్‌, జన విజ్ఞానదర్శిని సభ్యులు, సర్పంచ్‌ వెంకటలక్ష్మి, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

కోడ్‌ కూసింది.. ఫ్లెక్సీ తొలగింది..!

నారాయణపేట: మోగిన మున్సిపల్‌ నగరా.. మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ రావడంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో వివిధ పార్టీలకు చెందిన బ్యానర్లు మున్సిపల్‌ కమిషనర్‌ నర్సయ్య ఆదేశాలతో సిబ్బంది తొలగింపు చర్యలు చేపట్టారు. తొలగించిన బ్యానర్లను మున్సిపల్‌ వాహనాల్లో తీసుకెళ్లి కార్యాలయ ఆవరణలో ఉంచుతున్నారు. ఎవరైనా ప్రచార బోర్డులు పెడితే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ చెప్పుకోస్తున్నారు. బుధవారం నుంచి మొదలవుతున్న నామినేషన్ల స్వీకరణకు అధికారులు, సిబ్బంది సన్నద్ధమయ్యారు.

రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

రాజ్యాంగ పరిరక్షణతోనే సమాజ శ్రేయస్సు 
1
1/1

రాజ్యాంగ పరిరక్షణతోనే సమాజ శ్రేయస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement