నీటి గుంతలో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

నీటి గుంతలో పడి వ్యక్తి మృతి

Jan 22 2026 7:37 AM | Updated on Jan 22 2026 7:43 AM

నీటి

నీటి గుంతలో పడి వ్యక్తి మృతి

బల్మూర్‌: మండలంలోని రామాజిపల్లిలో మంగళవారం రాత్రి నీటి గుంతలో పడి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వివరాలు.. గ్రామానికి చెందిన కురువ పెద్ద నాగయ్య (36) మంగళవారం మధ్యాహ్నం నుంచి కని పించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా.. తన వ్యవసాయ పొలంలో ఉన్న స్టోరేజీ నీ టి గుంతలో రాత్రి శవమై తేలాడు. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు మృతదేహాన్ని 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపారు.

ఉరేసుకొని

యువకుడి ఆత్మహత్య

అయిజ: పట్టణంలోని బో యపేటకు చెందిన వెంకటేష్‌ బుధవారం ఇంట్లోనే ఉరేసుకొని మృతి చెందా డు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటేష్‌ తల్లి, తండ్రి గతంలో నే మరణించారు. అన్న, వదినలు ఉన్నా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఒంటరిత నం భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కాలనీ ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి అంత్యక్రియల నిమిత్తం మృతుడి కుటుంబసభ్యలకు సభ్యులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు.

విద్యుదాఘాతానికి

యువ రైతు బలి

దామరగిద్ద: పొలంలో విద్యుత్‌ తీగలను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై యువ రైతు మృతి చెందిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన బుడ్డపోళ్ల నారాయణ (26) ఉదయం పొలంలో ప్రధాన విద్యుత లైన్‌ నుంచి విద్యుత్‌ మోటార్‌ స్టాటర్‌ వరకు ఉన్న విద్యుత్‌ సర్వీస్‌ వైర్‌ను లాగి కట్టే క్రమంలో తెగిపోవడంతో విద్యుత్‌ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. నారాయణకు ఆరేళ్ల క్రితం వివాహం కాగా భార్యతో పాటు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ సత్యమ్మ తిప్పణ్ణ, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్‌ కోరారు

రోడ్డు ప్రమాదంలో

వృద్ధురాలు మృతి

హన్వాడ: మండల పరిధి లోని చిన్నదర్పల్లిలో బుధ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురా లు గాయపడి చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు చిన్నదర్పల్లికి చెందిన జిన్నారం రాజ మ్మ (63) తాండూర్‌ ప్రధాన రహదారిపై రో డ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైంది. పా తులవత్‌ రాజేందర్‌ నాయక్‌ అనే వ్యక్తి బైక్‌పై హన్వాడ నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్లే క్ర మంలో రాజమ్మను ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజమ్మను చికిత్స నిమి త్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి కుమారుడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

నవాబుపేట: చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కారుకొండ గ్రామంలో చోటు చేసుకుంది. కారుకొండకు చెందిన కేశిరెడ్డి అంజమ్మ కూతురు అమృత (42)ను పదేళ్ల క్రితం అగ్రహారానికి చెందిన ఆంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు సంతానం. భర్త కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొన్ని నెలలుగా భర్త ఖాళీగా ఉండడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన అమృత ఈనెల 19న విష ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించి జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపారు.

కేఎల్‌ఐ కాల్వలో

వృద్ధురాలి మృతదేహం

బిజినేపల్లి: మండలంలోని మంగనూర్‌కు చెందిన బోట్క మణెమ్మ (55) మూడు రోజుల కిందట అదృశ్యమైంది. బుధవారం సాయంత్రం కేఎల్‌ఐ కాల్వలో మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మణెమ్మ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెదికారు. బుధవారం కేఎల్‌ఐ కాల్వలో మృతదేహం కనిపించడంతో బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు.

నీటి గుంతలో  పడి వ్యక్తి మృతి  
1
1/2

నీటి గుంతలో పడి వ్యక్తి మృతి

నీటి గుంతలో  పడి వ్యక్తి మృతి  
2
2/2

నీటి గుంతలో పడి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement