జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
కందనూలు: జిల్లాకు చెందిన శివ, రాజేశ్వరీ, చైతన్య, అరవింద్, సంతోష్ క్రాస్ కంట్రీ పోటీల్లో సత్తా చాటి నేషనల్ లెవల్‌కు ఎంపికై నట్లు కోచ్ స్వాములు శుక్రవారం తెలిపారు. ఈనెల 2న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వివిధ కేటగిరీల్లో పది కిలోమీటర్ల పరుగు పందెంలో సత్తా చాటడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి జార్ఖండ్‌లోని రాంచీలో జరిగే నేషనల్ లెవల్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈమేరకు విద్యార్థులను జిల్లా అసోసియేషన్ సభ్యులు, వ్యాయామ శుక్రవారం అభినందించి జాతీయస్థాయి పోటీల్లోనూ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.


