సీనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు సంగీత
మహబూబ్‌నగర్ క్రీడలు: నవాబ్‌పేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన కావలి సంగీత జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 27 నుంచి 30 వరకు జరిగే 72వ సీనియర్ నేషనల్ మహిళా కబడ్డీ చాంపియన్‌షిప్‌కు ఎంపిక కావడంతో జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు శాంతికుమార్ హర్షం వ్యక్తం చేశారు. సంగీతను రాష్ట్ర జట్టులో ఎంపిక చేసినందుకు రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేశ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్‌రెడ్డికు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.


