బాలికలకు హక్కులపై అవగాహన ఉండాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఇందిర హాజరై మాట్లాడారు. బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని, విద్య ప్రాధాన్యత తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా బాలికలకు రక్షణ కల్పిస్తున్న పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి బాలికకు సమాన గౌరవం, సమాన అవకాశాలు, రక్షణ లభించాల్సిన అవసరం ఉందన్నారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో హక్కులను పరిరక్షించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీజే మమతారెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


