ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు స్వయంగా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఇన్నోవేషన్ లెర్నింగ్ సంస్థ సీఈఓ స్వాతి రుషిత అన్నారు. జేపీఎన్‌సీ కళాశాలలో శుక్రవారం ఆంత్రపెన్యూర్‌షిప్‌పై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రుషిత మాట్లాడుతూ.. విద్యార్థులు నూనత ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకోవాలని, వీటికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటివి వీటికి ఎంతో దోహదపడతాయన్నారు. ఆవిష్కరణలకు తెలంగాణ టీ–హబ్ వరంగా ఉంటుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు దివ్య, మధులశ్‌బాబు, గురురాఘవేందర్‌రెడ్డి, రాహుల్, దివ్యతేజ, స్రవంతి, నితీశ్ తదితరులు పాల్గొన్నారు.


