ఆటో బోల్తా .. మహిళ మృతి
● మరో మహిళ పరిస్థితి విషయం
● ఏడుగురికి గాయాలు
ధన్వాడ: ఆటో బోల్తా పడి మహిళా కూలీ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మరికల్ మండలం అపంపల్లి గ్రామంలో వరినాట్లు వేసేందుకు అదే గ్రామానికి చెందిన ఆటో కూలీలను ఎక్కించుకునేందుకు ధన్వాడకు వచ్చింది. స్థానికంగా కంచుకోట వీధిలోని గంగమ్మ దేవాలయం వద్ద 15 మహిళా కూలీలను ఎక్కించుకొని అపంపల్లికి వెళ్తుంది. ఈ క్రమంలో ధన్వాడ పాత పోలీసు స్టేషన్ సమీపంలో పంది అడ్డురావడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో కూర్చున్న దండు జయమ్మ, బోయినిపల్లి మంజులకు తీవ్రగాయాలు కావడంతో నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే దండు జయమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అదే విధంగా మంజుల పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ ఆస్పత్రికి తరలించారు. వీరితో మరో ఏడుగురు స్వల్పంగా గాయపడటంతో స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి జయమ్మ కుమారుడు నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.
రూ.5 లక్షలు పరిహారం
ఆటో ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబానికి న్యాయం చేయలంటూ పోలీసు స్టేషన్ వద్ద బంధువులు, కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆటో యజమాని తరుఫున పలువు రు పంచాయతీ చేపట్టారు. రూ.20 లక్షలు ఇవ్వా ల ని డిమాండ్ చేయడంతో రూ.5 లక్షలు పరిహారం ఇచ్చేందుకు సమ్మతి తెలిపినట్లు సమాచారం.
ఆటో బోల్తా .. మహిళ మృతి
ఆటో బోల్తా .. మహిళ మృతి


