మానవ జీవితంలో సైన్స్‌ ఎంతో కీలకం | - | Sakshi
Sakshi News home page

మానవ జీవితంలో సైన్స్‌ ఎంతో కీలకం

Jan 25 2026 7:27 AM | Updated on Jan 25 2026 7:27 AM

మానవ జీవితంలో సైన్స్‌ ఎంతో కీలకం

మానవ జీవితంలో సైన్స్‌ ఎంతో కీలకం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సైన్స్‌ మానవ జీవితంలో ఎంతో కీలకంగా మారిందని, ఉదయం నిద్రలేచిన సమయం నుండి సాయంత్రం పడుకునే సమయం వరకు ప్రతి అంశం కూడా సైన్స్‌తో మిలితమైందన్నారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో మైక్రోబయోలజీ, బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆద్వర్యంలో ‘‘అడ్వాన్సెస్‌ ఇన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఫర్‌ డైవర్సిటీ అప్లికేషన్స్‌ అండ్‌ హ్యూమన్‌ వెల్పేర్‌ –2025’’ అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జీవశాస్త్ర తాజా పరిశోధనల్లో సాంకేతిక ఆవిష్కరణలు, మానవ సంక్షేమానికి అవి చేసేసేవల గురించి చర్చించడానికి ఇది ఒక చక్కటి వేదిక అన్నారు. సైన్స్‌ మానవ జీవితాన్ని సులభతం చేసేందుకు నిరంతరం జరుగుతున్న పరిఽశోధనలు, ప్రయోగాలు కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయన్నారు. నేటి ఆధునిక కాలంలో సైన్స్‌ రంగాల్లో విద్యార్థులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని వారు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగాల కోసం వేచి చూడకుండా వాటిని అందించే విధంగా ఆలోచన దృక్పదాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన విజన్‌ డాక్యూమెంట్‌లో దేశ వ్యాప్తంగా 20లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ఉన్న అవకాశాలను వివరించారన్నారు. వీటితోపాటు రైజింగ్‌ తెలంగాణ పాలసీలో కూడా ఉద్యోగ, ఉపాధి మెరుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో 15నెలల కాలంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, ముఖ్య విద్యార్థులకు నాణ్యమైన, నైపుణ్యాలు కలిగిన విద్యను అందించేందుకు కృషి చేశామని, భవిషత్‌లో మరిన్ని మార్పులు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సెమినార్‌కు సంబంధించి సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీయూ మాజీ వీసీ భాగ్యనారాయణ, ఆర్జేడీ రాజేందర్‌సింగ్‌, ప్రిన్సిపాల్‌ పద్మావతి, పీయూ ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రెడ్డి, ఓయూ మాజీ రిజిస్ట్రార్‌ భద్రయ్య, కన్వీనర్‌ హరిప్రసాద్‌, ముగింపు కార్యక్రమానికి హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఉపాధ్యక్షుడు మహమూద్‌, పీయూ రిజిస్ట్రార్‌ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

స్టేట్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బాలకిష్టారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement