పాలమూరు @ 75 ఏళ్లు
స్వర్ణోత్సవ వేడుకలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 2002 ఆగస్టు 7న భారీస్థాయిలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. అప్పటి మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్ ఆధ్వర్యంలో దాదాపు వారం రోజులపాటు ఈ వేడుకలు కొనసాగాయి. ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీ భవనం 1989 సంవత్సరంలో అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పి.చంద్రశేఖర్ ప్రారంభించారు.
పాలమూరు నగరం వ్యూ
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి ఎంతో ఘన చరిత్ర ఉంది. 1951లో ఏర్పాటైన మున్సిపాలిటీ ఇప్పటికే 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాటి నుంచి మూడో గ్రేడ్, రెండో గ్రేడ్, మొదటి గ్రేడ్, ప్రత్యేక గ్రేడ్, సెక్షన్ గ్రేడ్ వరకు ఎదగడం విశేషం. ఈ ప్రస్థానంలో ఎన్నో రాజకీయ, సామాజిక, ఆర్థికపరమైన ఆటుపోట్లు ఎదుర్కొంది. గొప్ప వ్యక్తులను మున్సిపాలిటీకి చైర్మన్లుగా పనిచేశారు. అయితే మొదటిసారి ఎన్నికై న క్రమంలో 1951 ఎలాంటి ఎన్నిక జరగకుండా కౌన్సిల్ బాడీ ఎన్నికై ంది. ఆ తర్వాత 1952– 53 మధ్య కాలంలో కాంగ్రెస్ నేత శంకర్‌రావు నామినేటెడ్ పద్ధతిలో మున్సిపాలిటీకి తొలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తదనంతరం 1953 నుంచి 1992 వరకు ఆరు పర్యాయాలు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. టీడీపీ పాలనలో 1995– 2000, 2000– 2005లో మున్సిపాలిటీకి ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. 2004లో రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికలకు నిర్ణయించింది. 2005 నుంచి మళ్లీ మున్సిపాలిటీకి పరోక్ష పద్ధతిలోనే ఎన్నికలు జరిగాయి. గతేడాది జనవరి 27న కార్పొరేషన్‌గా అవతరించింది.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి ఆదాయం 75 ఏళ్లలో కొంత కొంత పెరుగుతూ వచ్చింది. 1953– 57 మధ్య కాలంలో మున్సిపాలిటీ వార్షిక ఆదాయం రూ.97 వేలు మాత్రమే. రెండో చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు ఆదాయం పెంచడానికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం కార్పొరేషన్ ఆదాయం రూ.55 కోట్లు కాగా వ్యయం రూ.60 కోట్లకు చేరింది.
రూ.97 వేల నుంచి..
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో చైర్మన్లుగా కొనసాగింది వీరే..
1951లో మొదటిసారిగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ ఏర్పాటు
ఇప్పటి వరకు కొనసాగిన 13 మంది చైర్మన్లు
మూడుసార్లు
ప్రత్యేకాధికారుల పాలన
తొలి మహిళా చైర్‌పర్సన్‌గా రాధ బాధ్యతలు
తాజాగా తొలి కార్పొరేషన్ మేయర్ పీఠం మహిళకే..
పాలమూరు @ 75 ఏళ్లు


