అచ్చంపేటలో మోస్ట్ వాంటెడ్..
ఆంధ్ర, ఒడిశా, చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో కీలకంగా పనిచేస్తున్న దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు, కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న మీసాల సాలోమాన్‌తోపాటు ఆయన భార్య సన్‌బట్టిని పోలీసులు అచ్చంపేటలో అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సాలోమాన్ 32 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా అగ్రనేతలు తిప్పరి తిరుపతి, దేవ్‌జీ, హిడ్మా వంటి వారితో పనిచేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తూ అక్కడి మావోయిస్టు దళాలకు గెరిల్లా యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయన భార్య సైతం దండకారణ్యం డీవీసీఎం కేడర్, పీఎల్‌జీ బెటాలియన్ సభ్యురాలిగా కీలకంగా పనిచేస్తున్నారు. ఈ దంపతులు దండకారణ్యాన్ని వదిలి నల్లమల ప్రాంతానికి చేరుకోవడం.. ఈ క్రమంలోనే అరెస్ట్ కావడం స్థానికంగా అలజడి సృష్టించింది.


