ఓటరు పేర్లు పపపపపప, సీమాంధ్ర
● తుది ఓటరు జాబితాలో విచిత్రమైన పేర్లు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు దొర్లడం సహజం. పేర్లు తప్పులు పడడం, ఒక వార్డులో ఉన్న వారి పేర్ల మరో వార్డులో పడడం. తండ్రుల పేర్లు తప్పుడు పడడం చూశాం. కానీ మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితాలో చిత్రవిచిత్రమైన పేర్లు దర్శనమిచ్చాయి. ఓటరు పేరు పపపపపప, తండ్రి పేరు పపపపపప, మరో ఓటర్ పేరు సీమాంధ్ర అని వచ్చాయి. కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్‌లో కొత్తగంజ్ ప్రాంతంలోని 169, 170 పోలింగ్‌స్టేషన్‌లో పరిధిలోని ఓటరు జాబితాలో ఇవీ కనిపించాయి. ఓటరు తుది జాబితా విడుదలకు ముందు ముసాయిదా జాబితాలో ఇతర గ్రామాలకు చెందిన ఓట్లు మున్సిపాలిటీలో వచ్చిన విషయం తెలిసిందే. వీటిని సవరించి అధికారులు విడుదల చేసిన తుది జాబితాలో కూడా ఇలాంటి తప్పుడు రావడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఓటరు పేర్లు పపపపపప, సీమాంధ్ర


