కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తాం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కాంగ్రెస్ ప్రభు త్వం కక్షపూరితంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను వేధిస్తే రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఫోన్ టాంపరింగ్ కేసు విచారణలో సిట్ అధికారులు చట్టవిరుద్ధంగా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ గా వెళ్లి అంబేడ్కర్ చౌరస్తాలో భైఠాయించి నినాదాలు చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూ స్తుందన్నారు. హైకోర్టు నిబంధనల ప్రకారం ఎక్కడ ఉంటే అక్కడ విచారణ చేయాలని, పోలీసులు నిబంధన పక్కకు పెట్టి గోడకు నోటీసులు అంటించడం దుర్మార్గం అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించిన కేసీఆర్‌ను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. పోలీస్ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయవద్దని, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలీసుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేసిందని, రెండేళ్ల తర్వాత మళ్లీ వస్తాం.. మీ తప్పుడు కేసులకు.. బెదిరింపులకు వెనక్కి తగ్గమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసులు, జైళ్లకు భయపడలేదని, కొట్లాడి తెలంగాణ సాధించిన వాళ్లమన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పుర ఎన్నికల బరిలో దిగుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు అలీ మస్కతి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, రెహమాన్, నాయకులు గణేష్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్, నవకాంత్, సాయిలు, సుధాకర్ పాల్గొన్నారు.


