రమణీయం.. నృసింహస్వామి రథోత్సవం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రం సింహగిరిలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుప్రభాతం, చతుస్థానార్చనలు, మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి, అలంకారం తదితర పూజలు నిర్వహించారు. సూర్యప్రభ వాహనసేవలో స్వామి వారిని ఊరేగించారు. రాత్రి స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీలక్ష్మీ, నరసింహుల ఉత్సవ విగ్రహాలను రథంలో ఊరేగించారు. భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, పురోహితుల వేద మంత్రాల మధ్య నిర్వహించిన రమణీయమైన వేడుకలను తిలకించి.. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. గోవింద నామస్మరణలతో సింహగిరి మార్మోగింది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి చక్రతీర్థం పూజలు నిర్వహిస్తారు.
స్వామివారి రథోత్సవం
సూర్యప్రభ వాహనసేవలో భక్తులు
రమణీయం.. నృసింహస్వామి రథోత్సవం


