పేలవంగా ఉంది.. | - | Sakshi
Sakshi News home page

పేలవంగా ఉంది..

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

పేలవం

పేలవంగా ఉంది..

కేంద్ర బడ్జెట్‌ పేలవంగా ఉంది. బడ్జెట్‌లో కీలక కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు కేటాయింపుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. మహిళలు, రైతులు, యువతకు వ్యతిరేకంగా బడ్జెట్‌ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదు. మధ్య, దిగువ తరగతి వర్గాల కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహక చర్యలు తీసుకోలేదు.

– లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్‌నగర్‌

కార్పొరేట్‌కే మేలు..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజలను భ్రమలో ముంచేలా ఉంది. కార్పొరేట్‌కు మేలు చేసే బడ్జెట్‌ ఇది. పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని మార్చి వీబీజీ రామ్‌జీ పథకాన్ని తీసుకొచ్చి కూలీలకు 125 పనిదినాలు కల్పిస్తామని ప్రగల్బాలు పలికి తీరా బడ్జెట్‌లో గతం కంటే తక్కువ కేటాయింపులు చేయడం చూస్తే పేదలపై ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తుంది. ప్రస్తుత బడ్జెట్‌ మొత్తంలో 28 శాతం అప్పులకే పోగా.. మిగతా వాటిలోనూ కార్పొరేట్‌కే అగ్రభాగం కేటాయించడం దారుణం. – రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్‌

పాలమూరుకు మొండిచేయి..

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేవ లం మాటల గారడీ తప్పా సామాన్యుడికి, ముఖ్యంగా పాలమూరు ప్రాంతానికి జరిగిన మేలు శూన్యం. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ బడ్జెట్‌లో కూడా మొండిచేయి చూపారు.. ఈ ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పిస్తారని ఆశించిన జిల్లా ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది. జిల్లా నుంచి ముంబయి, హైదరాబాద్‌ వంటి నగరాలకు జరుగుతున్న వలసలను ఆపేలా స్థానిక పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. బడ్జెట్‌లో యువతకు ఉద్యోగాల ఊసేలేదు. – సంజీవ్‌ ముదిరాజ్‌,

డీసీసీ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్‌

పేలవంగా ఉంది.. 
1
1/2

పేలవంగా ఉంది..

పేలవంగా ఉంది.. 
2
2/2

పేలవంగా ఉంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement