జములమ్మా.. సల్లంగ చూడమ్మా.. | - | Sakshi
Sakshi News home page

జములమ్మా.. సల్లంగ చూడమ్మా..

Feb 2 2026 7:21 AM | Updated on Feb 2 2026 7:21 AM

జములమ

జములమ్మా.. సల్లంగ చూడమ్మా..

గద్వాలన్యూటౌన్‌: డోళ్ల సప్పుళ్లు.. వాయిద్యాలు.. భక్తుల పూనకాల మధ్య.. కొంగుబంగారంగా విరాజిల్లుతున్న జములమ్మ అమ్మవారి పౌర్ణమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు 60వేల మంది భక్తులు దర్శించుకున్నారు. సల్లంగా.. చూడమ్మ జములమ్మ తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని ప్రార్థించారు.

వైభవంగా వేడుకలు

పౌర్ణమి వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున 4గంటలకు 108 కలశాలతో అమ్మవారికి పూజలు జరిపించారు. పంచామృతా భిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో 5గంటలకు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున 3:30 గంటల నుంచే క్యూలైన్‌లో నిల్చున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు, ఏపీ, కర్ణాటక, మహరాష్ట్రల నుంచి దాదాపు 60వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మధ్య్యాహ్నం 12గంటల ప్రాంతంలో భక్తుల రద్దీ పెరిగింది. డప్పుల మోతలు...డోళ్ల సప్పుళ్లతో ఆలయ ప్రాంగణానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. కోళ్లు, మేకపోతులు అర్పించారు. సాయంత్రం అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో ఉంచి ఆలయ ప్రాంగణ పరిసరాల్లో పల్లకీసేవ చేశారు.

పకడ్బందీ ఏర్పాట్లు

భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈఓ పురందర్‌కుమార్‌, సిబ్బంది భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా పర్యవేక్షించారు. పోలీస్‌, ఆలయ సిబ్బంది క్యూలైన్‌లో తోపులాటలు జరగకుండా నియంత్రించారు. వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. తాగునీటి వసతి కల్పించారు. ఎండవేడిమిని తట్టుకోలేక చాలామంది భక్తులు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళ కింద సేదతీరడం కన్పించింది.

పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

అమ్మవారి పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు తెల్లవారుజామున ఆలయాన్ని సందర్శించారు. అధికారులు వారికి స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు జరిపించారు. మాజీ జెడ్పీ చైర్మన్‌ సరిత ఆలయాన్ని సందర్శించారు. అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు జరిపించారు.

వైభవంగా మాఘపౌర్ణమి వేడుకలు

అమ్మవారిని దర్శించుకున్న 60 వేల మంది భక్తులు

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్‌

పట్టువస్త్రాలు సమర్పించిన గద్వాల ఎమ్మెల్యే దంపతులు

ఘనంగా పల్లకీసేవ

జములమ్మా.. సల్లంగ చూడమ్మా.. 1
1/2

జములమ్మా.. సల్లంగ చూడమ్మా..

జములమ్మా.. సల్లంగ చూడమ్మా.. 2
2/2

జములమ్మా.. సల్లంగ చూడమ్మా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement