పరిశీలన తర్వాత మారిన లెక్క
● మొత్తం నామినేషన్లు 781.. అభ్యర్థులు మాత్రం 516 మంది
● మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 6 నామినేషన్ల తిరస్కరణ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు గాను 781 నామినేషన్లు వచ్చినట్లు ఆదివారం ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇందులో ముందుగా చెప్పినట్లు 521కి బదులుగా 516 మందే అభ్యర్థులు ఉన్నట్లు లెక్క తేల్చారు. పార్టీల వారీగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీ నుంచి 216, బీఆర్‌ఎస్ నుంచి 99, బీజేపీ నుంచి 78, ఇండిపెండెంట్లు 64, ఇతరులు 25 మంది, ఎంఐఎం నుంచి 23, బీఎస్పీ నుంచి 7, ఆప్ నుంచి 2, సీపీఎం నుంచి 2 ఉన్నారు. ఇక డివిజన్ నంబర్ 14 నుంచి మాజీ కౌన్సిలర్ మునీరుద్దీన్ వేసిన నామినేషన్‌తో పాటు వివిధ డివిజన్ల నుంచి మరికొందరు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ వేసిన వాటిలో మరో ఐదు ఇలా మొత్తం 6 తిరస్కరణకు గురయ్యాయి. చివరకు వీటికి సంబంధించిన నివేదికను జిల్లా ఎన్నికల అధికారులకు పంపించారు.


