డిపాజిట్‌ అంటే తెలుసా? | - | Sakshi
Sakshi News home page

డిపాజిట్‌ అంటే తెలుసా?

Feb 2 2026 7:21 AM | Updated on Feb 2 2026 7:21 AM

డిపాజిట్‌ అంటే తెలుసా?

డిపాజిట్‌ అంటే తెలుసా?

కల్వకుర్తి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌/కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎన్నికల సంఘం కొన్ని అర్హతలను నిర్దేశించింది. అభ్యర్థుల నుంచి నామినేషన్‌ వేసేందుకు కొంత రుసుం వసూలు చేస్తుంది. నిర్దేశిత ఓట్లు వచ్చిన వారికి ఆ రుసుం తిరిగి చెల్లిస్తారు. దీనినే డిపాజిట్‌ అని పిలుస్తారు.

● మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరికి చెందిన అభ్యర్థులు రూ.1,250, కార్పొరేషన్‌లో రూ.2,500, ఇతరులు మున్సిపాలిటీలో రూ.2,500, కార్పొరేషన్‌లో రూ.5,000 చొప్పున నామినేషన్‌ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది.

● ఫలితాల అనంతరం అభ్యర్థికి కనీస ఓట్లు వస్తేనే డిపాజిట్‌ తిరిగిస్తారు.

● డిపాజిట్‌ తిరిగి పొందాలంటే ఎన్నికలో నమోదైన ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు అభ్యర్థి పొందాలి. అంటే 100కు దాదాపుగా 17 ఓట్లు పొందాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement