ఫిర్యాదుల పరిష్కారం కోసం హెల్ప్‌లైన్‌ | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుల పరిష్కారం కోసం హెల్ప్‌లైన్‌

Jan 29 2026 8:14 AM | Updated on Jan 29 2026 8:14 AM

ఫిర్యాదుల పరిష్కారం కోసం హెల్ప్‌లైన్‌

ఫిర్యాదుల పరిష్కారం కోసం హెల్ప్‌లైన్‌

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఎన్నికల సమాచారం, ఫిర్యాదులపై కలెక్టరేట్‌లో ఫిర్యాదుల పరిష్కారం కోసం హెల్ప్‌లైన్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయేందిర బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2వ సాధారణ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా కార్యాలయంలో ఫిర్యాదుల పరిష్కారం కోసం 08542–241165 నంబర్‌కు ఫోన్‌ చేసి, ఎన్నికల సంబంధించిన సమాచారం, ప్రవర్తన నియమావళి, ఉల్లంఘనపై సంప్రదించవచ్చచి పేర్కొన్నారు. ఈ కంట్రోల్‌ రూమ్‌లో 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. రిజిస్టర్‌ ఏర్పాటు చేసి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

గడువులోగా అనుమతులు మంజూరు చేయాలి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ టీజీ ఐపాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపనకు గడవులోగా అనుమతులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయేందిర సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆమె జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో టీఫ్రైడ్‌ ద్వారా షెడ్యూల్డ్‌ కులాల వారికి ఇద్దరికి ట్రాన్స్‌పోర్ట్‌ సెక్టర్‌ కింద రెండు ట్రాక్ట ర్లు, షెడ్యూల్డ్‌ తెగల వారికి ముగ్గురికి ట్రాక్టర్‌ అండ్‌ ట్రాలీ, ఇద్దరికి గూడ్స్‌ వాహనాల కోసం పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు ఆమో దం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లలో కనీస సదుపాయాలు సంబంధించి చిన్నచిన్న పను లు ఉంటే చేయాలని టీజీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ను ఆదేశించారు. జిల్లాపరిశ్రమల జనరల్‌ మే నేజర్‌ యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.

టికెట్‌ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టికెట్‌ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌ 60 డివిజన్లకు సంబంధించి పార్టీ నుంచి పోటీ చేయడానికి 292 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అన్ని డివిజన్లకు అభ్యర్థుల ఖరారు చివరిదశకు చేరిందన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కమిటీ చర్చించిన అనంతరం గురువారం అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. పార్టీ తరఫున ఆశావహులు ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయాలని సూచించారు. ఇండిపెండెంట్‌గా వేస్తే వారిని పరిగణలోకి తీసుకోమన్నారు. టికెట్‌ రానివారు నిరాశ చెందకుండా టికెట్‌ కేటాయించిన అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీపట్ల విధేయులుగా ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, అలాగే పార్టీని నమ్ముకొని కొత్తగా వచ్చిన వారికి కూడా టికెట్లు ఇస్తామని చెప్పారు. ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌ యాదవ్‌, నాయకులు జహీర్‌ అఖ్తర్‌, చంద్రకుమార్‌గౌడ్‌, సీజె బెనహర్‌, నయీమ్‌, రాములుయాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement