గుప్తనిధుల కోసం అడవిలో బ్లాస్టింగ్
బల్మూర్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతమైన బల్మూర్ మండలం బిల్లకల్ అటవి ప్రాంతంలో (ఏడు నంధుల వద్ద) గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం ఏకంగా బ్లాస్టింగ్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. బిల్లకల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో గల దట్టమైన అడవిలోని సలేశ్వరం వెళ్లే నడక దారిలో గల ఏడు నంధుల వద్ద పాపమ్మ అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ గుప్తనిధుల కోసం బ్లాస్టింగ్ చేయడంతో పాటు బండరాళ్లపై బ్లాస్టింగ్‌కు యంత్రంతో రంధ్రాలు చేసి పూసలతో పేల్చి తవ్వినట్లు ఆనవాళ్లు లభించాయి. దీనిని గమనించిన అటవిశాఖలో పని చేసే ఓ వాచర్ సమాచారం ఇవ్వడంతో శనివారం వెలుగులోకి వచ్చింది. కాగా అడవిలోకి ఎవరైన కొత్త వ్యక్తులు వెళ్లాలంటే బిల్లకల్ సమీపంలోనే రుసుల చెరువు వద్ద చెక్ పోస్టు ఉంది. అక్కడ సీసీ కెమోరా కూడా ఉంది. దుండగులు అడవిలోకి ఏమార్గం ద్వారా వచ్చి ఉంటారనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు బ్లాసింగ్ చేసిన శబ్ధం రాకుండా కూడా దుండగులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
చర్యలు తీసుకోవాలని
కోరుతున్న ప్రజలు
గుప్తనిధుల కోసం అడవిలో బ్లాస్టింగ్


