పంటపొలాల్లో చిరుత సంచారం
దేవరకద్ర రూరల్: బొల్లారం–సందాపూర్ మధ్యలోని వ్యవసాయ పొలాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం రెండు గ్రామాల మధ్యనున్న వరిపొలాల మధ్య చిరుత సంచరిస్తుండగా గమనించిన రైతులు బెంభేలెత్తారు. చిరుతను దూరం నుంచి తనఫోన్‌లో ఒక రైతు వీడియా తీశాడు. ఈ విషయాన్ని సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్లిన వారికి తెలుపగా భయాందోళనకు గురై ఇళ్లకు చేరుకున్నారు. చిరుత తమ పొలాల మీదుగా చిన్నరాజమూరు వైపుగా వెళ్లిందని రైతులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.


