‘మేజర్’నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్
దేవరకద్ర: మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా దేవరకద్రను అప్‌గ్రేడ్ చేశారు. 1947 నుంచి 2025 వరకు ఉమ్మడి జిల్లాలో మేజర్ పంచాయతీగా గుర్తింపుతోపాటు పశువుల సంత, కూరగాయల సంత ప్రత్యేకత సంతరించుకున్న దేవరకద్ర గతేడాది మున్సిపాలిటీగా మారింది. నియోజకవర్గంలోని కొత్తకోట, భూత్పూర్ జిల్లాల పునర్విభజనలో మున్సిపాలిటీలుగా మారాయి. దేవరకద్ర విషయంలో ఆనాటి నాయకులు చిన్నచూపు చూడడంతోనే మున్సిపాలిటీగా మారలేదనే విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిలకు ముందు దేవరకద్రను మున్సిపాలిటీగా మార్చడానికి ప్రతిపాదనలు పంపించారు. కాని ఫైల్ మూలన పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూలనపడ్డ ఫైల్‌ను కదిలించడంతో గతేడాది దేవరకద్ర మున్సిపాలిటీగా మారింది.
నాలుగు గ్రామాలతో..
దేవరకద్ర మున్సిపాలిటీలో చౌదర్‌పల్లి, మీనుగోనిపల్లి, పెద్దగోప్లాపూర్, బల్సుపల్లి పంచాయతీలను విలీనం చేసి మున్సిపాలిటీగా మార్చారు. మొదటి సారిగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఇక్కడ కొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నాయి. మొత్తం 12 వార్డులుగా విభజించిన మున్సిపాలిటీలో 10,070 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 4,909, సీ్త్రలు 5,161గా ఉన్నారు. మొత్తం 23పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
దేవరకద్ర మున్సిపల్ కార్యాలయం


