ఆటో డ్రైవర్‌కు మూడురోజుల జైలుశిక్ష
మహబూబ్‌నగర్ క్రైం: ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో అధిక మోతాదులో మద్యం తాగి ఆటో నడుపుతున్న డ్రైవర్‌ను వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. మద్యం తాగి నిర్లక్ష్యంగా ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని పోతుండగా.. తనిఖీ ల్లో భారీగా మద్యం తాగినట్లు నిర్ధారణ కా గా.. సదరు ఆటో డ్రైవర్‌ను గురువారం కోర్టులో హాజరుపర్చగా సెకండ్‌క్లాస్ న్యాయమూర్తి శశిధర్ డ్రైవర్‌కు మూడురోజుల జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధించారు. దీంతో పోలీసులు ఆటోడ్రైవర్‌ను జిల్లా జైలుకు తరలించారు.
రైతుకు విద్యుత్ షాక్
గద్వాల క్రైం: మండలంలోని కొండపల్లికి రైతు రఘునాథ్ రెడ్డి ప్రమాదవశాత్తు విద్యుదాఘా తానికి గురయ్యాడు. గురువారం ఉదయం త న పొలంలో పంటకు నీళ్లందించేందుకు బో ర్ మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్ర మంలో విద్యుత్ సప్‌లై కాలేదు. సమీపంలోని ట్రా న్సఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో కుప్పకూలిపోయా డు. గమనించిన స్థానిక రైతులు వెంటనే 108 లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విష మంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమి త్తం కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
బావిలో పడి మహిళ మృతి
ఎర్రవల్లి: బావిలో పడి మ హిళ మృతి చెందిన ఘట న మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని బొచ్చువీరాపురం గ్రామానికి చెందిన జయమ్మ (38) భర్త పెద్దస్వామితో కలిసి గురువారం మధ్యాహ్నం పొలంలో పంటకు మందు పిచికారీ చేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో నీళ్ల కోసం బావిలో దిగగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందింది. నీరు తెచ్చేందుకు వెళ్లిన భార్య ఎంతకు తిరిగి రాకపోవడంతో భర్త వెళ్లి చూడగా బావి లో విగతజీవిగా కన్పించింది. గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీయ గా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కో దండాపురం ఎస్‌ఐను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు.


