మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
నవాబుపేట: మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవించే వ్యక్తికి కుటంబంతో అనుమానం రేకెత్తి గొడవలకు దారితీసింది. దీంతో కొన్నిరోజు లు కుటుంబ గొడవలకే పరిమితం కాగా తాజాగా ఏకంగా ఆత్మహత్యకు దారితీసి ప్రాణాలు తీసుకున్న ఘటన. మండల కేంద్రంలో మాందువాద శివకుమార్(35) మేసీ్త్ర పని చేసుకుంటూ జీవించేవాడు. 8ఏళ్లకిందట దోమ మండలానికి చెందిన లలితతో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. భార్య ప్రవర్థనలో మార్పురావడంతో అనుమానం పెరిగి తరచూ గొడవ పడేవారు. కుటుంబ సభ్యులు సర్దిచెప్పి పంపించేవారు. తాజాగా బుధవారం అందరూ తిని నిద్రకు ఉపక్రమించిన తర్వాత శివకుమార్ వేరే గదిలోకి వెళ్లి వెంటిలేటర్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్లవారు జామున భార్య భర్తకోసం వెతికితే వేరే గదిలో ఉరివేసుకుని కనిపించాడు. మృతుడి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
ఆటోబోల్తా: వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు
మిడ్జిల్: ఆటో బోల్తాపడిన ఘటనలో వ్యక్తి మృతిచెందగా.. ముగ్గురు గాయాలపాలైన ఘటన మండలంలోని మసిగొండ్లపల్లి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లికి చెందిన పాపకంటి నర్సింహ, ఆయన మనుమరాలు పాపకంటి స్వప్న, ఈదులబావి తండాకు చెందిన ఫిర్యానాయక్, మసిగొండ్లపల్లికి చెందిన దుబ్బ రాములు మసిగొండ్లపల్లి నుంచి మిడ్జిల్‌కు వస్తుడగా.. గ్రామ సమీపంలోని మలుపు వద్ద బోల్తా పడి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ‘108’లో జడ్చర్ల ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పాపకంటి నర్సింహ(75) మృతిచెందగా, ఫిర్యానాయక్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే నర్సింహ, మనుమరాలితో కలిసి బంధువుల గ్రామమైన మసిగొండ్లపల్లికి గురువారం ఉదయం వచ్చారు. బంధువులను కలిసి తిరుగు ప్రయాణంలో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిర్యానాయక్‌ను మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన నర్సింహ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
లింగాల: మండలంలోని అంబట్‌పల్లి–శాయిన్‌పేట మధ్య ఈనెల 18న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన గెంటెల తిరుపతయ్య(53) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందినట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్ తెలిపారు. మృతుడు మరో వ్యక్తి బాలచంద్రంతో కలిసి బైక్‌పై నాయినోనిపల్లి మైసమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు మూలమలుపులో ఎదురుగా వచ్చిన కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని హెచ్‌సీ తెలిపారు. మృతుడి తమ్ముడు గెంటెల విష్ణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
వెల్దండ: మండలంలోని ఎంజీతండాకు చెందిన మూడవత్ నరే్‌శ (18) చికి త్స పొందుతూ హైదరా బాదులోని గాంధీ ఆస్పత్రి లో గురువారం మృతి చెందినట్లు ఏఎస్‌ఐ జాకిహు ల్లా తెలిపారు. వివరాలు..బుధవారం ఉద యం ఎంజీతండాకు చెందిన నరేష్ ఆటోలో వెల్దండ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా తండా సమీపంలో మూలమలుపు వద్ద ఆటో అదపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. క్షతగాత్రు డిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో వెల్దండలోని యెన్నమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయమించడంతో మెరుౖ గెన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందు తూ మృతి చెందినట్లు ఏఎస్‌ఐ తెలిపారు. నరే ష్ హైదరాబాదులోని నాంపల్లిలో ఐటీఐ చదువుతున్నాడు. మృతుడి తండ్రి దేన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
వనపర్తి రూరల్: మండలంలోని కడుకుంట్లకు చెందిన ఓ వ్యక్తి కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుచ్చన్న (50) గురువారం కూలీ పని నిమిత్తం వనపర్తికి వచ్చాడు. మరికుంట కాలనీలో భవన నిర్మాణానికి తీసుకెళ్లారు. అక్కడ పనులు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై కింద పడిపోగా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య


