నిజరూప దర్శనం
చివరి రోజు విశేష పూజలు
వసంత పంచమి వేడుకలకు సిద్ధం
ప్రశాంత వాతావరణంలో దర్శనం
నేడు జోగుళాంబమాత
అలంపూర్: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠం అలంపూర్‌లో వెలిసిన జోగుళాంబమాత వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 19న ప్రారంభమైన ఉత్సవాలు శుక్రవారంతో ముగుస్తాయి. చివరి రోజు అమ్మవారికి సహస్ర ఘట్టాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా గురువారం కుంకుమార్చనలు, త్రిశతి అర్చన, ఖడ్గమాల అర్చనలు విశేషంగా జరిపించారు. చండీహోమం, పవమానసూక్త పారాయణ, అవాహిత దేవతా హోమాలు కొనసాగాయి.
శుక్రవారం వసంత పంచమి సందర్భంగా జోగుళాంబ అమ్మవారు నిజ రూపంలో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కలశాలను ధరించి ఊరేగింపుగా వచ్చే భక్తులకు సైతం ప్రత్యేక క్యూలైన్లు కల్పిస్తున్నారు. తాగునీరు, ఉచిత ప్రసాదాలు, అన్నప్రసాదం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఉత్సవాల చివరి రోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆవాహిత దేవతా హోమాలకు పూర్ణాహుతి సమర్పిస్తారు. గంటలేశ్వర ఆలయం నుంచి జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు జాతర ప్రారంభం కానుంది. గ్రామదేవత వేషధారణలో కళాకారులు, కలశాలతో మహిళ భక్తులు ఊరేగింపు నిర్వహిస్తారు. జోగుళాంబ సేవా సమితి సభ్యులు అమ్మవారికి సుగంధ ద్యవాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్థానికులతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారు కలశాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారు. అభిషేక దర్శనాన్ని భక్తులు నిజరూప దర్శనంగా భావిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిజరూప దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం అమ్మవారికి అభిషేక అనంతరం అలంకారం, భక్తులకు సాధారణ దర్శనాలు కల్పిస్తారు. సాయంత్రం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి శాంతి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. చివరిగా ఆలయంలో దశవిద హారతి అనంతరం ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దీప్తి పేర్కొన్నారు.
విద్యుత్ కాంతుల వెలుగులో జోగుళాంబ ఆలయం
సహస్ర ఘట్టాలతో
అమ్మవారికి అభిషేకాలు
ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు
భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, వసతుల ఏర్పాటు
అలంపూర్ క్షేత్రానాకి వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారు, స్వా మివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. భక్తులకు అమ్మవారి నిజరూప దర్శనం ఏడాదికి ఒక్కసారే కలుగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానుండటంతో అందుకు తగ్గట్టుగా క్యూలైన్లు, సౌకర్యాలు కల్పిస్తున్నాం.
– దీప్తి, ఆలయాల ఈఓ, అలంపూర్
నిజరూప దర్శనం
నిజరూప దర్శనం


