పాలమూరులో మార్మోగిన రామనామం
● వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ
ద్వితీయ వార్షికోత్సవం
● పాతగంజిలో ఉట్టిపడిన ఆధ్యాత్మికభావం
మహోత్సవంలో పాల్గొన్న భక్తులు
స్టేషన్ మహబూబ్‌నగర్: అయోధ్య శ్రీబాలరాముని ప్రాణప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రం క్లాక్‌టవర్‌లోగల పాతగంజి వద్ద హైందవ శక్తిసేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం శ్రీ రామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. ముందుగా ఉత్సవ విగ్రహాలను వేపూరిగేరి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాతగంజి వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి.. పూజా కార్యక్రమాలు, శ్రీరా ముని పట్టాభిషేకం జరిపారు. సామూహిక హనుమాన్‌చాలీసా పారాయణం నిర్వహించారు. క్లాక్‌టవర్ నుంచి పాతగంజి వరకు ఉన్న రహదారి భక్తులతో కిటకిటలాడింది. వేదికపై శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చిన్నారుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, దేవతామూర్తుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.
ధర్మానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు
ధర్మానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు అని రాధా మనోహర్‌దాస్‌స్వామి అన్నారు. మహోత్సవంలో పాల్గొని ధార్మిక ప్రవచ నం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా ఐక్యంగా సంఘటితం కావాలని కోరారు. అదేవిధంగా అయోఘ్ దేశపతి ప్రసంగించారు. అయోధ్యలో శ్రీ బలరాముడి ప్రతిష్ఠాపనతో ఎన్నో వందల ఏళ్ల కల సాకారమైందన్నారు. ఎంతో వైభవంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యే క ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీని వాస్‌గౌడ్, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, జేపీఎన్‌సీఈ చైర్మన్ కేఎస్.రవికుమార్ ప్రత్యేక పూజలు చేశారు. హైందవ శక్తిసేవా సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్, సంతోష్‌కుమార్, కమల్ కిషోర్ రాఠి, భాస్కర్, కా ర్యదర్శి బాల్‌రాజు, రమే ష్, రామకృష్ణ, అనంతసా యి, గణేష్, ఆంజనేయులు, అఖిల భార త అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ పాల్గొన్నారు.
పాలమూరులో మార్మోగిన రామనామం
పాలమూరులో మార్మోగిన రామనామం
పాలమూరులో మార్మోగిన రామనామం


