గంజాయి తాగుతున్న యువకుల అరెస్టు, రిమాండ్
తెలకపల్లి: గంజాయి సేవిస్తున్న యువకులను పోలీసులను పట్టుకొని రి మాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ నరేశ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఎస్‌కే కోహినూర్ పంక్షన్ హాలు సమీపంలో గంజా యి సేవిస్తుండగా కొంతమంది యువకులపై పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. మొత్తం ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తున్నట్లు తెలిపా రు. తెలకపల్లికి చెందిన జహీర్‌ఖాన్, రాకొండకు చెందిన బొమ్మసాని సా యి, అచ్చంపేటకు చెందిన గోపి, ఎస్‌కే ఖాజ, రామకృష్ణ ఉన్నారు. వారి దగ్గర 12 గ్రాముల గంజాయి, 3 సెల్‌ఫోన్‌లు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయిని హైదరాబాద్‌లోని సురేశ్ అనే యువకుడి వద్ద కొనుగోలు చేసి మూడేళ్లుగా అలవాటు పడ్డారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. యువత గంజాయికి బానిస కావద్దని విలువైన జీవితాలను బలి చేసుకోవద్దని ఎస్‌ఐ పేర్కొన్నారు.


