కొత్త పురపాలికం మద్దూరు
మద్దూరు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మద్దూరు గ్రామపంచాయతీని గతేడాది జనవరి 27న మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. మద్దూరు మేజర్ గ్రామపంచాయతీతో పాటు రెనివట్ల, భీంపూర్, నాగంపల్లి, సాపన్‌చెరవుతండా, ఏర్రగుంట తండా పంచాయతీలు కలిపి మున్సిపాలిటీలో విలీనం చేశారు. 1955 నుంచి మద్దూరు, భీంపూర్, నాగంపల్లి, సాపన్‌చెరువుతండా కలిపి మద్దూరు గ్రామ పంచాయతీగా ఉండేది. అప్పటి నుంచి మొదటి సర్పంచ్ జయచారి, తర్వాత వెంకట్‌రావు కొత్తూరు బసిరెడ్డి, బర్ల అంజయ్య, కాశీమన్నగౌడ్, చంద్రశేఖర్, పార్వతమ్మ, సిపిరి వెంకటయ్య ఉమ్మడి మద్దూరు సర్పంచ్‌లుగా వ్యవహరించారు. తర్వాత తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతో మద్దూరు పంచాయతీగా అరుణ చివరి సర్పంచ్‌గా ఉన్నారు. ప్రస్తుతం మద్దూరులో 12,701 మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషులు 6,171 మంది, మహిళలు 6,530 మంది ఉన్నారు. 16 వార్డులకు 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.


