తాజాగా మల్లు రవి వర్సెస్ విజయుడు..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. అలంపూర్ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌కు చెందిన విజయుడు ఉన్నారు. అయితే కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు అంతా తానై అధికారం చెలాయిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ అధికారిక కార్యక్రమాలతో పాటు నిత్యం జరుగుతున్న ఇసుక, మట్టి, మొరం, అసైన్డ్ భూముల దందాల్లో చక్రం తిప్పతున్నారు. ఏ పని అయినా ఆయనకు కమీషన్, వాటా ముట్టనిదే ముందుకు కదలడం లేదనే టాక్ ఉంది. తన మాట వినని అధికారులను బెదిరిస్తున్నట్లు ఇటీవల ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఒక్క నియోజకవర్గమే కాదు.. గద్వాలలో సైతం ఖాకీలు, ఇతర అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని చక్రం తిప్పుతున్నారని.. తనను లెక్కచేయని ఓ జిల్లా స్థాయి అధికారి బదిలీ వెనుక ఆయన ‘హస్తమే’ ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పైపాడులో ఈ నెల 20వ తేదీన ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే విజయుడి మధ్య ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. వివిధ అభివృద్ధి పనులకు టెంకాయ కొడుతున్న సమయంలో ఇరువురితో పాటు వారి వారి అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎంపీ మల్లు రవి తోసివేస్తూ దుర్భాషలాడినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారగా.. రాజకీయ రచ్చకు తెరలేసినట్లయింది. దీనిపై ఎమ్మెల్యే విజయుడిని దూషిస్తూ అవమానం చేసిన ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత న్యూఢిల్లీ వేదికగా మల్లు రవి ‘నేను ఎమ్మెల్యేను తిట్టింది గానీ, కొట్టింది గానీ లేదు. కానీ నేను ఎమ్మెల్యేపై భౌతిక దాడి చేశానని కేటీఆర్ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారు నాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే నిరాహార దీక్షకు కూర్చుంటా’ అని ప్రతిస్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు గద్వాల జిల్లాలో ఏం జరుగుతోందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తాజాగా మల్లు రవి వర్సెస్ విజయుడు..
తాజాగా మల్లు రవి వర్సెస్ విజయుడు..


