కనులపండువగా శ్రీవారి కల్యాణం
బిజినేపల్లి: పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం కనులపండువగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు నిత్యారాధన, ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. అనంతరం ఉదయం 11 గంటలకు అలివేలుమంగ సమేత శ్రీవారి ఉత్సవమూర్తులకు కల్యాణతంతు ప్రారంభించారు. వందలాది మంది భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఆలయ అర్చక బృందం మాంగళ్యధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు కురవి రామానుజాచార్యులు కల్యాణం తిలకించిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ– 3 సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పీయూ పీజీ కళాశాల పరీక్ష కేంద్రాలను వీసీ శ్రీనివాస్, కంట్రోలర్ ప్రవీణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షలకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి, కాపీయింగ్‌కు ఎలాంటి ఆస్కారం లేకుండా చూడాలన్నారు. శుక్రవారం మొత్తం తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో 1,830 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కనులపండువగా శ్రీవారి కల్యాణం


