నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. గురువారం ఆ పార్టీ క్యాంపు కార్యాఆలయంలో మహబూబ్‌నగర్ కార్పొరేషన్ డివిజన్ల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన వారికి, గెలిచే అభ్యర్థులకు మాత్రమే టికెట్ వస్తుందన్నారు. టికెట్ రాలేదని ఎవరూ నిరాశ పడొద్దని, భవిష్యత్‌లో పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు మంచి స్థానం కల్పిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు కష్టపడి పని చేయాలన్నారు. మహబూబ్‌నగర్ పురపాలికలో బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మోసాలు గల్లీగల్లీకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో పుర ఎన్నికల పరిశీలకులు అలీ మస్కతి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


