నామినేషన్లకు నేడు ఆఖరు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలు ఊపందుకుంది. పార్టీ పరంగా అధికారికంగా టికెట్లు కేటాయించకపోయినా ఆశావహులు నామినేషన్లు వేసేందుకు పోటీపడ్డారు. జిల్లాలో 82 డివిజన్లు, వార్డులు ఉండగా.. తొలిరోజు 14 నామినేషన్లు వచ్చాయి. గురువారం రెండో రోజు 233 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సాయంత్రం 5 గంటలు దాటినా చాలా మంది నామినేషన్లు వేయడానికి రావడంతో ఏడు గంటల వరకు వారిని అనుమతించారు. అత్యధికంగా 4వ డివిజన్ నుంచి ఎనిమిది మంది దాఖలు చేయగా 3, 17, 21, 40, 41, 43, 54, 55, 58 డివిజన్ల నుంచి ఒక్కొక్కరే దాఖలు చేశారు. మొత్తం 60 డివిజన్లకు రెండోరోజు 186 నామినేషన్లు వచ్చాయి. మొదటి రోజు దాఖలైన 9తో కలుపుకొని 195కు చేరుకున్నాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 102, బీజేపీ నుంచి 37, బీఆర్‌ఎస్ నుంచి 25, ఇండిపెండెంట్లు 21, ఇతరులవి రెండు ఉన్నాయి.
భారీగా బిల్లుల వసూలు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు ‘నో డ్యూ సర్టిఫికెట్’ కోసం తమ ఇంటి ఆస్తిపన్ను, నల్లాబిల్లులు చెల్లించేందుకు క్యూ కడుతున్నారు. ఈనెల 27 నుంచి ఇప్పటివరకు ఆస్తిపన్ను కింద రూ.31.61 లక్షలు, నల్లా బిల్లు బకాయిలు ఏకంగా రూ.29.34 లక్షలు వసూలు కావడం గమనార్హం.
దేవరకద్ర మున్సిపాలిటీలోని 12 వార్డులకు మొత్తం 30 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 10 నామినేషన్లు వచ్చాయి. బీఆర్‌ఎస్ నుంచి ఆరు, బీజేపీ నుంచి 9 మంది దాఖలు చేయగా.. మరో ఐదుగురు నామినేషన్లు వేశారు. భూత్పూర్ మున్సిపాలిటీలో రెండోరోజు 17 నామినేషన్లు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి ఒకటి, బీఆర్‌ఎస్ నుంచి నాలుగు, ఇతరులు నలుగురు ఉన్నారు. రెండో వార్డులో రెండు, 3వ వార్డులో నాలుగు, నాలుగో వార్డులో ముగ్గురు, ఐదో వార్డులో ఒకరు, ఆరోవార్డులో ఇద్దరు, ఏడో వార్డులో ఇద్దరు, ఎనిమిదో వార్డులో ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా.. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో దాఖలయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటివరకు ప్రధాన పార్టీల నుంచి అధికారికంగా అభ్యర్థుల జాబితా విడుదల కాలేదు.
రెండోరోజు జోరందుకున్న ప్రక్రియ
మహబూబ్‌నగర్ కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలకు 233 నామినేషన్లు దాఖలు
చివరి రోజు భారీగా వచ్చే అవకాశం
నామినేషన్లకు నేడు ఆఖరు


