పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి వేణుగోపాల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో పీఓ, ఏపీఓలకు ఇచ్చిన శిక్షణలో ఆయన మాట్లాడారు. అర్హులైన వారు ఫారం–12 పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, వీటిని నింపి ఫిబ్రవరి 3 తేదీ వరకు మునిసిపల్ కార్యాలయంలో గానీ కలెక్టరేట్ లేదా నోడల్ ఆఫీసర్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఎలక్షన్ సిబ్బంది మునిసిపల్ కార్యాలయంలో ఫిబ్రవరి 7వ తేదీన ఏర్పాటు చేయు ఫెసిలిటేషన్ సెంటర్‌లో కూడా ఓటు వేయ వచ్చని తెలిపారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఎలక్షన్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్, డ్రైవర్లు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వంటి రక్షణ దళాలలో పనిచేసే పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు అని పేర్కొన్నారు.


