జనసంద్రంగా పాలెం రథోత్సవం
పాలెం వీదుల్లో రథోత్సవ
ఉరేగింపు
బిజినేపల్లి: పాలెం శ్రీవారి బ్రహ్మోత్సవాల ముఖ్య ఘట్టమైన రథోత్సవం సోమవారం తెల్లవారుజాము వరకు జనసంద్రంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన రథోత్సవం బాణాసంచా వెలుగులో మిరమిట్లు గొలిపింది. భక్తులు పోటీతో తేరును ఆలయ పూరవీధుల్లో లాగారు. రథోత్సవ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఉదయం నిత్యపూజా కార్యక్రమాల అనంతరం సాయంత్రం స్వామివారికి ఉద్దాల మహోత్సవం ఆరంభమైంది. కార్యక్రమంలో స్వామివారి ఉద్దాలను భక్తులకు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉత్సవాల్లో మాజీ చైర్మన్ భక్తులకు నిత్యాన్నదానం చేశారు.


