ముగిసిన ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు
రంగాపూర్ ఉర్సులో భక్తులు
ఉమామహేశ్వరంలో భక్తులు
అచ్చంపేట: శ్రీశైలం ఉత్తర ద్వారం ఉమామహేశ్వర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. వారం పాటు భక్తుల సందడితో క్షేత్రం కళకళలాడింది. ఉత్సవాల చివరి రోజు గవ్యంత పూజలు, వాస్తుపూజ, వాస్తుహోమంతో పాటు పాపనాశనంలో ఉత్తరాయణ పుణ్య స్నానాలు, ప్రత్యేక పూజలను వేద పండితులు వీరయ్యశాస్త్రి నిర్వహించారు. వేడుకలను ఆలయ కమిటీ అధ్యక్షుడు బీరం మాధవరెడ్డి, కార్య నిర్వహణాధికారి శ్రీనివాస్‌రావు పర్యవేక్షించారు.
కొనసాగుతున్న ఉర్సు
మండలంలోని రంగాపూర్ నిరంజన్ షావలీ ఉర్సు వైభవంగా కొనసాగుతుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పొట్టేళ్లు సమర్పించి ఫాతేహాలు, కందోరీలు చేసి మొక్కులు చెల్లించారు. కోరిన కోరికలు తీరాలని చెట్టుకు ముడుపులు కట్టారు.
ముగిసిన ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు


