చికిత్స పొందుతూ వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Feb 1 2026 3:41 AM | Updated on Feb 1 2026 3:41 AM

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నవాబుపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స ిపొందుతున్న వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మండలంలోని చౌటపల్లికి చెందిన ఈడిగి ఆంజనేయులు(43) శుక్రవారం సొంత పనిమీద మండల కేంద్రానికి వచ్చి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. లోకిరేవు సమీపంలో బైక్‌ అదుపుతప్పి కిందపడి గాయాల పాలయ్యాడు. అటుగా వెళ్తున్నవారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స ిపొందుతూ శనివారం మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ విషయంలో మృతుడి భార్య సుధారాణి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్‌ వివరించాడు.

● ఆంజనేయులు మృతిచెందిన వెంటనే కుటుంబ సభ్యులు మృతుడి కళ్లను సరోజిని కంటి ఆస్పత్రికి దానం చేశారు. దీనికి సంబంధించి శనివారం వారు ఆస్పత్రి సిబ్బందికి అంగీకారప్రతం అందజేశారు. కాగా, మరణం అనంతరం ఇతరులకు చూపునిస్తున్న మృతుడి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement