ఉత్తరాఖండ్‌పై హైదరాబాద్‌ విజయం | - | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌పై హైదరాబాద్‌ విజయం

Feb 1 2026 3:41 AM | Updated on Feb 1 2026 3:41 AM

ఉత్తర

ఉత్తరాఖండ్‌పై హైదరాబాద్‌ విజయం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో ఏర్పాటు చేసిన టర్ఫ్‌ పిచ్‌పై శనివారం మొదటిసారిగా జాతీయస్థాయి మ్యాచ్‌ నిర్వహించారు. హైదరాబాద్‌–ఉత్తరాఖండ్‌ జట్ల మధ్య ఇన్విటేషన్‌ వన్డే మ్యాచ్‌ ఉత్సాహంగా సాగింది. ఇందులో హైదరాబాద్‌ జట్టు మూడు వికెట్ల తేడాతో ఉత్తరాఖండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఉత్తరాఖండ్‌ నిర్ణీత 40 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. జట్టులో నీలం భరద్వాజ్‌ 71, నందిని కౌషిక్‌ 49 పరుగులు, ఇంద్రాని రాయ్‌ 39 పరుగులు, కంచన్‌ పరిహర్‌ 29 పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో యశశ్రీ, సాక్షిరావు రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ మహిళలు 38.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించారు. జట్టులో ఓపెనర్‌ సంధ్యగోర అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి 98 (89 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్‌) పరుగులతో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. వంకపూజ (35), ఎం.సాక్షిరావు (28) రాణించారు.

● జిల్లాకేంద్రంలో తొలిసారిగా జరుగుతున్న జాతీయస్థాయి మ్యాచ్‌ను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, జేపీఎన్‌సీఈ చైర్మన్‌ కేఎస్‌ రవికుమార్‌, హెచ్‌సీఏ ప్రతినిధి బస్వరాజ్‌ తదితరులు తిలకించారు. ఇరు జట్ల క్రికెటర్లను పరిచయం చేసుకొని వారిని ఘనంగా సన్మానం చేశారు. మ్యాచ్‌కు నగరంలోని పలు విద్యాసంస్థలు, జేపీఎన్‌సీఈ కళాశాలకు చెందిన విద్యార్థినులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఎండీసీఏ చీఫ్‌ ప్యాట్రన్‌ వి.మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌, ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, సభ్యుడు క్రిష్ణమూర్తి, కోచ్‌లు గోపాలకృష్ణ, మన్నాన్‌, ముఖ్తార్‌ అలీ, నారాయణపేట రమణ, సీనియర్‌ క్రీడాకారులు ఆబిద్‌, రంజిత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎండీసీఏలో ఉత్సాహంగాహైదరాబాద్‌–ఉత్తరాఖండ్‌ మ్యాచ్‌

మ్యాచ్‌ను తిలకించిన రాష్ట్ర ప్రభుత్వ క్రీడలసలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి

ఉత్తరాఖండ్‌పై  హైదరాబాద్‌ విజయం   1
1/1

ఉత్తరాఖండ్‌పై హైదరాబాద్‌ విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement