మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

Jan 27 2026 8:33 AM | Updated on Jan 27 2026 8:33 AM

మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

ఎర్రవల్లి: ఎందరో మహానుభావుల త్యాగఫలం వల్లే మనమంతా ఈరోజు ఇలా స్వతంత్రంగా జీవిస్తున్నామని అలాంటి మహానీయుల త్యాగాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పదో బెటాలియన్‌ కమాండెంట్‌ జయరాజు అన్నారు. సోమవారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో పటాలంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యకమ్రానికి ముఖ్య అతిథిగా కమాండెంట్‌ హాజరై జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం కమాండెంట్‌ మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం కన్న కళలను సాధించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమే పోలీస్‌శాఖకు నిజమైన గౌరవమని సూచించారు. అనంతరం పటాలంలో వివిధ విభాగాల్లో ప్రతిభను కనబర్చి ఉత్తమ సేవలందించిన సిబ్బందిని కమాండెంట్‌ అభినందించి సేవా పథకాలను అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పాణి, ఆర్‌ఐలు ఆర్‌.పి.సింగ్‌, నర్సింహ, శ్రీనివాసులు, రాజేశం తదితరులు ఉన్నారు.

పదో బెటాలియన్‌ కమాండెంట్‌ జయరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement