వేరుశనగకు రికార్డు ధర | - | Sakshi
Sakshi News home page

వేరుశనగకు రికార్డు ధర

Jan 24 2026 7:58 AM | Updated on Jan 24 2026 7:58 AM

వేరుశనగకు రికార్డు ధర

వేరుశనగకు రికార్డు ధర

బాదేపల్లి, కల్వకుర్తి మార్కెట్‌లో

క్వింటా రూ.10వేలకు పైనే..

ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర

జడ్చర్ల/నారాయణపేట/కల్వకుర్తి రూరల్‌/దేవరకద్ర: ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా క్వింటా వేరుశనగ రూ.10 వేలు దాటింది. శుక్రవారం బాదేపల్లితో పాటు కల్వకుర్తి మార్కెట్‌లో ఈ ధరలు పలకడం విశేషం. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం క్వింటా కు రూ.411 పెరిగింది. మార్కెట్‌కు 1,679 క్వింటాళ్ల విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ.10,280, కని ష్టంగా రూ.7,560 ధరలు లభించాయి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.7,263గా ఉంది. గతే డాది కనీసం మద్దతు ధర కూడా లేదని, త్వరలోనే క్వింటా ధర రూ.11 వేలు పలకవచ్చని వ్యాపా రులు అంచనా వేస్తున్నారు. ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం గరిష్టంగా రూ.2,752, కనిష్టంగా రూ.2,649, కందులు గరిష్టంగా రూ.7,801, కనిష్టంగా రూ. 5,766, మొక్కజొన్న రూ.1,921 ధరలు పలికాయి. కల్వకుర్తి మార్కెట్‌లో వేరుశనగా గరిష్టంగా రూ. 10,200, కనిష్టంగా రూ.9,369 ధర లభించింది. కందులు క్వింటాల్‌కు రూ.7,009 ధరకు కొనుగోలు చేసినట్లు మార్కెట్‌ కార్యదర్శి శివరాజ్‌ తెలిపారు.

● నారాయణపేటలో వేరుశనగ గరిష్టంగా రూ. 8,935, కనిష్టంగా రూ.6,930, ఎర్ర కందులు గరిష్టంగా రూ.8,308, కనిష్టంగా రూ.6,369, తెల్ల కందులు గరిష్టంగా రూ.8,270, కనిష్టంగా రూ.6,422 గా దేవరకద్రలో కందులు గరిష్టంగా రూ.7,059, కనిష్టంగా రూ.6,959గా ధరలు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement