యూరియాకు రైతుల బారులు
మండలానికి చెందిన రైతులు యూరియా కోసం శనివారం తెల్లవారుజాము నుంచే సింగిల్ విండో కార్యాలయం ఎదుట బారులు తీరారు. రెండు రోజులుగా మండలంలో సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. ఏఈఓలు రైతుల ఆధార్, పాసు పుస్తకాలు తనిఖీ చేసి యూరియా అందజేశారు. ఈ విషయమై ఏఓ కమల్‌కుమార్ మాట్లాడుతూ.. గత యాసంగి కంటే ఎక్కువగా పంట సాగు ఉందని, దీంతో యూరియా వినియోగం పెరిగిందన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
– బిజినేపల్లి


