గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి
మక్తల్: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతీయ జెండాను ఎగురవేస్తుండగా కట్టె విరిగిపడింది. వివరాలిలా.. మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సతీష్‌కుమార్ జాతీయ జెండాను ఎగురవేస్తుండగా అకస్మాత్తుగా జెండా ఏర్పాటు చేసిన కట్టె అకస్మాత్తుగా విరిగి కిందపడింది. ఈ ప్రమాదంలో నాగేందర్ అనే వ్యక్తి కాలిపై కట్టె పడటంతో రక్త గాయం కాగా.. పక్కనే రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మరో కట్టెకు జెండా ఏర్పాటు చేసి తహసీల్దార్ ఎగురవేశారు. జెండా కట్టె పాతది కావడంతో విరిగిపోయిందని సిబ్బంది తెలిపారు.
● జెండావిష్కరణలో విరిగిన కట్టె
● రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం


