మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలి
దేవరకద్ర: మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయని, పార్టీపరంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు అందరు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. పార్టీ టికెట్లు రాని వారు నిరాశ చెందవద్దని వారిని పార్టీ ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తుందన్నారు. టికెట్ రాని వారు నిరాశకు గురి కాకుండా పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని కోరారు. దేవరకద్ర మున్సిపాలిటీలోని 12 వార్డులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తామని, అలాగే వార్డుల వారీగా సర్వేలు చేసి, అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి అందరూ ఐక్యమత్యంగా పని చేయాలని కోరారు. సమావేశంలో నాయకుల లక్ష్మీకాంత్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, బాలస్వామి, అంజన్‌కుమార్‌రెడ్డి, వెంకటేశ్, వేణుగోపాల్‌రెడ్డి, ఫారూఖ్, ఆదిహన్మంతరెడ్డి, శంకర్, శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌రాజు, చెన్నయ్య, రాము, రాములు, చంద్రమౌలి, బుచ్చన్న, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


