అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా పరేడ్‌మైదానంలో గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మొదట స్కౌట్స్ అండ్‌గైడ్స్ నుంచి విద్యార్థులు నృత్యం చేయగా, ఆ తర్వాత అక్షర హైస్కూల్, మహితి హైస్కూల్, ఎస్సీ డీడీ హాస్టల్ విద్యార్థులు నృత్యం ఆకట్టుకుంది. రోడ్డు భద్రతపై ఆర్టీఏ శాఖవినూత్న కార్యక్రమం నిర్వహించింది. అంతకుముందు స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్‌తో కలిసి కలెక్టర్ విజయేందిర సన్మానించారు.
శకటాల ప్రదర్శన
వేడుకల్లో భాగంగా ప్రభుత్వ శాఖల పనితీరు అద్దం పట్టే విధంగా ఆయా శాఖలు శకటాల ప్రదర్శన నిర్వహించాయి. వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, గ్రామీణా అభివృద్ధి శాఖ, పురపాలక శాఖ, వైద్యారోగ్యశాఖ, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, మహిళ శిశు సంక్షేమ శాఖలు తమ శాఖల పనితీరును శకటాల ద్వారా వినూత్నంగా ప్రదర్శించాయి. సందేశాత్మక నమూనాలతో పాటు సృజనాత్మక ఆవిష్కరణలతో శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో మహబూబ్‌నగర్ పురపాలక శాఖకు మొదటి బహుమతి, వైద్యారోగ్యశాఖకు రెండో బహుమతి, అగ్నిమాపక శాఖకు మూడో బహుమతి లభించాయి. ఆ తర్వాత మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్‌నాయక్, ఎస్పీ జానకి, ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు


