అభివృద్ధిలో పాలమూరు పరుగులు
న్యూస్‌రీల్
మహబూబ్‌నగర్
పాలమూరు: అభివృద్ధిలో పాలమూరు జిల్లా పరుగులు పెడుతోందని, రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. జిల్లాలో ఈసారి యాసంగిలో 1.34లక్షల ఎకరాలు సాగు అయిందని, రైతు భరోసా కింద వర్షకాలం సీజన్‌లో 2.14లక్షల మంది రైతులకు రూ.243 కోట్లు, రైతు బీమా కింద 283 మంది రైతుల నామినీ ఖాతాల్లో రూ.14 కోట్లు జమచేసినట్లు పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా పరేడ్ మైదనంలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జిల్లాలో జరిగిన అభివృద్ధిపై ప్రసంగించారు. ఆ వివరాలు ఆమె మాటల్లో.. మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ పైలెట్ కింద 43 వేల రైతులకు లక్షన్నర యూరియా సంచులు బుక్ చేసుకున్నారు. జిల్లాలో పట్టు పరిశ్రమల ద్వారా 714 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల విస్తరణ, డ్రిప్‌కు రూ.57 లక్షల రాయితీ, కొత్త ఉద్యాన పంటల కోసం 1394 ఎకరాలకు రూ.129 లక్షల రాయితీతో మంజూరు చేశాం. ఈ ఏడాది 230 చెరువులలో 67 లక్షల చేప పిల్లలను వదిలాం. ప్రమాదవశాత్తు మరణించిన 18 మంది మత్స్యకారులకు రూ.83 లక్షలు మంజూరు చేశాం.
జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కొత్వాల్, తదితరులు
● జిల్లాలో 2,75,825 కార్డులకు దాదాపు 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేశాం. 35 950 కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడంతో పాటు 70,602 కార్డులలో 1,46,979 కుటుంబసభ్యులను చేర్చాం. గత వర్షకాలం సీజన్‌లో 195 కేంద్రాల ద్వారా ఒక 1.43లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.343 కోట్లు ఖాతాల్లో జమ చేశారు.
● మహాలక్ష్మి పథకం కింద 1.02లక్షల మందికి ఆరు లక్షల గ్యాస్ సిలిండర్లు వినియోగించుకుని రూ.19 కోట్ల సబ్సిడీ పొందారు. మిషన్ భగీరథ కింద జిల్లాలో 1,50,113 ఇళ్లకు నల్లా కనెక్షన్ ద్వారా నీటి సరఫరా చేశాం. జిల్లాలో 11,035 ఇందిరమ్మ ఇళ్లకు రూ.552 కోట్ల అంచనా విలువతో మంజురు కాగా.. 7,324 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.144 కోట్ల నిధులు విడుదల చేశాం.
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
రైతు భరోసా కింద 2.14లక్షల మంది రైతులకు రూ.243కోట్లు
ఈ ఏడాది 67లక్షలచేప పిల్లలను పంపిణీ
35,950 కొత్త రేషన్ కార్డులు మంజూరు
జిల్లాకు 11,035 ఇందిరమ్మ ఇళ్లు, వివిధ దశల్లో ఉన్న 7,324 ఇళ్లు
గణతంత్ర వేడుకల్లోకలెక్టర్ విజయేందిర బోయి


