అంగరంగ వైభవంగా పాలఉట్లు
మక్తల్: మండలంలోని మాద్వార్‌లో గట్టుతిమ్మప్పస్వామి(లక్ష్మీవేంకటేశ్వరస్వామి) పాలఉట్లు కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం గ్రామం నుంచి ఊరేగింపుతో వెళ్లి పాలఉట్లు సందర్భంగా భక్తులు కోలాటం, చిన్నారులు ధాండీయ నత్యాలు, ఆడుగుల భజనలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు. స్వామివారి పాలఉట్లు కార్యక్రమానికి వివిధ ప్రాంతాలతోపాటు చుట్టపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. పాలఉట్ల కార్యక్రమాన్ని పల్లెగుంటి వెంకటేశ్ ఉట్టిని కొట్టారు. ఉట్టిని కొట్టినవారికి 5తులల వెండి కడియాన్ని జాజాపూర్ ప్రతాప్‌రెడ్డి చేతుల మీద అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజేశ్వర్‌రావు, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంతోష్‌రెడ్డి, డాక్టర్ ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.


