భద్రత లోపాలు లేకుండా పటిష్టమైన చర్యలు: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కడ భద్రత లోపాలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. నగరంలోని కార్పొరేషన్‌తో పాటు భూత్పూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. నామినేషన్ల కేంద్రాల దగ్గర బందోబస్తు విధానాన్ని పరిశీలించారు. ఎన్నికల నియమావళిని అమలు చేస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరం అయిన చోట అదనపు బలగాలు ఏర్పాటు చేయడం జరగాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా.. నగరంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ అప్పయ్య, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్, ట్రాఫిక్ సీఐతో పాటు పదిమంది ఎస్‌ఐలు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.


